తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rape Victim: 6 నెలలుగా బాలికపై 400 మంది అత్యాచారం! - మహారాష్ట్ర అత్యాచారం కేసు

ఉపాధి కోసం వెళ్లిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కామాంధులు. ఆరు నెలల వ్యవధిలో 400 మంది (rape victim in india) అత్యాచారం చేశారు. ఈ అమానవీయ ఘటన మహారాష్ట్ర బీడ్ జిల్లాలో జరిగింది.

gang rape
అత్యాచారం

By

Published : Nov 15, 2021, 8:48 AM IST

మహారాష్ట్ర బీడ్​ జిల్లాలో సభ్యసమాజం (rape victim in india) తలదించుకునే ఘటన జరిగింది. దిక్కుతోచని స్థితిలో ఉపాధి కోసం వెళ్లిన ఓ బాలికపై 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నాడు. బాలిక ప్రస్తుతం రెండు నెలల గర్భంతో ఉంది.

ఇదీ జరిగింది..

బీడ్‌లోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి రెండేళ్ల క్రితం మృతిచెందింది. అనంతరం తండ్రి ఆమెను (rape victim latest news) ఓ వ్యక్తికిచ్చి వివాహం చేశారు. భర్త, అతని తండ్రి బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. అది భరించలేని బాలిక ఏడాది తర్వాత పుట్టింటికి వచ్చేసింది. కొద్దిరోజులు ఇంట్లో ఉన్న ఆమె.. ఏదైనా ఉద్యోగం చేసుకుందామని అంబేజోగై పట్టణానికి చేరుకుంది. అయితే ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఆమెను ఓ ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు.

అది మొదలు ఆరు నెలల వ్యవధిలో తనపై 400 మంది అఘాయిత్యానికి (gang rape minor) ఒడిగట్టారని.. అందులో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:'పెళ్లి చేయండి.. లేకపోతే టవర్​పై నుంచి దూకేస్తా...'

ABOUT THE AUTHOR

...view details