తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం - జమ్ముకశ్మీర్‌ ప్రెజర్ కుక్కర్ బాంబులు

జమ్ముకశ్మీర్​లో జరిగిన ఓ ఆపరేషన్​లో అధిక తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆపరేషన్​ ద్వారా భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు తెలిపాయి.

40-kg high explosive material, IEDs recovered in J-K's Doda
ఉగ్ర స్థావరం గుర్తింపు- భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం

By

Published : May 8, 2021, 9:08 PM IST

జమ్ముకశ్మీర్‌ దోడా జిల్లాలో ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో 40 కిలోల ఆర్డీఎక్స్​తో పాటు.. పలు అధునాతన పేలుడు పరికరాలు, ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. ఈ ఆపరేషన్​లో పోలీసులు, సీఆర్​పీఎఫ్​, ఎస్​ఎస్​బీ దళాలు సంయుక్తంగా పాల్గొన్నట్లు వెల్లడించాయి.

పేలుడు పదార్థాలు ఉన్నాయన్న సమాచారం మేరకు.. దోడా జిల్లా చకరంది గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రక్షణ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఈ దాడుల్లో ఆర్డీఎక్స్, ప్రెజర్ కుక్కర్ బాంబులు(ఐఈడీలు), ఐరన్ పైప్ బాంబులు, నాలుగు డిటోనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్​ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న మారుమూల ప్రాంతాలను ఉగ్రవాదులు అస్థిరపరిచేందుకు కుట్రపన్నుతున్నట్లు గుర్తించామని భద్రతాధికారి తెలిపారు. ఈ చర్య ద్వారా ఉగ్రవాదుల కుట్రను విజయవంతంగా అడ్డుకున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:జమ్ముకశ్మీర్​లో​ ఎన్​కౌంటర్​- ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లో పాక్​ చొరబాటుదారుడు హతం

ABOUT THE AUTHOR

...view details