ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందిపూర్ ప్రాంతంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్లో (DRDO) పనిచేస్తున్న ఐదుగురు తాత్కాలిక సిబ్బందిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను (Indian defence secrets) విదేశీ సంస్థలకు ఫోన్‌లో సమాచారం అందిస్తున్నట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
వీరు తరచూ విదేశాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేయడాన్ని గుర్తించిన అధికారులు.. వారిపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నారు.