తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి - రాజస్థాన్ ఉదయపూర్​ వార్తలు

రాజస్థాన్​లో ఓ కారు​ బీభత్సం సృష్టంచింది. పొలం పనుల్లో నిమగ్నమైన కూలీలపైకి అతివేగంగా దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు మరణించారు.

rajastan accident
రాజస్థాన్​ ప్రమాదం

By

Published : Apr 12, 2021, 12:28 PM IST

రాజస్థాన్​లో పొలం పనులు చేస్తున్నవారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు. ఉదయపూర్​లోని బిందర్ పోలీస్ స్టేషన్ పరిధి బోర్తలై మోర్ గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన అనంతరం కారు డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు వివరించారు.

మరణించిన వారు తమ పొలంలోని బావి తవ్వకంలో నిమగ్నమై ఉన్నారని.. నియంత్రణ కోల్పోయిన కారు వారిపైకి దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న ప్రజలు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు జిల్లా ఎస్పీ రాజీవ్ పచ్చర్ సైతం సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ప్రాథమిక దర్యాప్తులో వాహనం నడిపిన వ్యక్తి మద్యం సేవించినట్లు తెలిసిందని వెల్లడించారు.

ఇవీ చదవండి:లైవ్ వీడియో: గ్రామస్థులను చితకబాదిన పోలీసులు

భారీ అగ్ని ప్రమాదం- ఇద్దరు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details