చైనా జలాల్లో చిక్కుకుపోయిన రెండు నౌకల్లోని 39 మంది భారతీయుల విషయంపై ఆ దేశంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. గత కొద్ది నెలలుగా వారు చైనాలోనే ఉన్నారని వెల్లడించింది.
ఎంవీ జగ్ ఆనంద్ అనే భారీ రవాణా నౌక హెబెయి రాష్ట్రంలోని జింగ్తంగ్ పోర్టులో నిలిచి ఉందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. జూన్ 13 నుంచి ఈ నౌక చైనాలోనే ఉందని తెలిపారు. ఇందులో 23 మంది భారతీయు సిబ్బంది ప్రయాణించారని చెప్పారు. 16 మంది సిబ్బందితో ఎంవీ అనస్తీషియా అనే మరో నౌక.. కావోఫిడియన్ పోర్టులో నిలిచిపోయిందని వివరించారు. సెప్టెంబర్ 23 నుంచి ఇది అక్కడే ఉందని స్పష్టం చేశారు.