Sisters killed by truck fall: మహారాష్ట్ర ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. భివాండీ తహసీల్లో ఇటుక బట్టీలకు ఉపయోగించే బొగ్గును అన్లోడ్ చేస్తుండగా ట్రక్కు పడి ముగ్గురు చిన్నారులు చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు కావడం గమనార్హం. అందులోనూ వారి వయసు కేవలం ముూడు నుంచి ఏడేళ్లులోపు మాత్రమే ఉన్నట్లు సంబంధీకులు తెలిపారు.
ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు చిన్నారుల సోదరి ప్రాణాలతో బయటపడింది. ఆ పాపకు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారి తల్లిదండ్రులు ఆ ఇటుక బట్టీల వద్ద కార్మికులుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనతో సంబంధం ఉన్న ఇటుక బట్టీ యజమాని సహా నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.