తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు.. ఏం జరిగింది? - అనుమానాస్పదంగా మరణించిన ముగ్గరు బాలికలు గ్గురు బాలికల మృతదేహాలు

ముగ్గురు బాలికల మృతదేహాలు చెట్టుకు వెేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన భారత్- నేపాల్ సరిహద్దులో జరిగింది. బాలికలు.. బిహార్​ కిషన్​గంజ్​లోని ఓ టీ తోటలో పనిచేస్తున్నారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

three girls hanging bihar
చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు

By

Published : Jul 25, 2022, 10:01 AM IST

Updated : Jul 25, 2022, 11:38 AM IST

భారత్- నేపాల్ సరిహద్దులో ముగ్గురు బాలికల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న నేపాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు నేపాల్ సరిహద్దులోని దల్లెగావ్​ గ్రామంలో లభించాయి. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది. అలాగే ముగ్గురు బాలికల మృతదేహాలు వేలాడుతున్న చెట్టు కింద చిన్న వాగు ప్రవహిస్తోంది.

చెట్టుకు వేలాడుతూ ముగ్గురు బాలికల మృతదేహాలు

అసలేం జరింగిందంటే:బిహార్ కిషన్​గంజ్​లోని ఓ టీ తోటలో ముగ్గురు బాలికలు పనిచేస్తున్నారు. వీరందరూ స్నేహితులు. ముగ్గురు బాలికల మరణం వెనుక లైంగిక వేధింపులు ఏమైనా ఉన్నాయా? టీ తోటకు చెందిన వారెవరైనా ఉన్నారా? అనే కోణంలో నేపాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని కొందరు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. లైంగిక వేధింపుల కారణంగానే ముగ్గురు బాలికలు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. టీ తోటకు సంబంధించిన వ్యక్తులను విచారించడానికి నేపాల్ పోలీసులు.. భారత్ పోలీసుల సహకారం తీసుకుంటున్నారు. అలాగే బాలికల కుటుంబానికి చెందిన కొందర్ని విచారించేందుకు నేపాల్ పోలీసులు సిద్ధమవుతున్నారు.

Last Updated : Jul 25, 2022, 11:38 AM IST

ABOUT THE AUTHOR

...view details