మహారాష్ట్ర పాల్గఢ్లో ఆదివారం రాత్రి 10:45 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం.. ట్విట్టర్ ద్వారా తెలిపింది. భూకంపం 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు పేర్కొంది.
మహారాష్ట్రలో భూకంపం- భవనాలకు పగుళ్లు - మహారాష్ట్రలో భూకంపం
మహారాష్ట్ర పాల్గఢ్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో భూకంపం- భవనాలకు పగుళ్లు
ఆదివారం రాత్రి ఒక్కసారిగా భూమి కంపించటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంప తీవ్రత వల్ల పాల్గఢ్లోని అనేక భవనాల్లో పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :బంగాల్ ఎన్నికల బరిలో శివసేన