తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మైనర్​ బాలికపై అత్యాచారం.. నిందితుడికి 46 ఏళ్ల జైలు శిక్ష - మైనర్​ బాలికపై అత్యాచారం

ఐదున్నర ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన కేసులో కేరళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి ఏకంగా 46 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు రూ.2.75 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది.

27-year-old-man-in-kerala-gets-cumulative-46-year-jail-term-for-raping-girl-in-kerala-plus
27-year-old-man-in-kerala-gets-cumulative-46-year-jail-term-for-raping-girl-in-kerala-plus

By

Published : Jul 20, 2022, 8:44 PM IST

Court Judgement On Rape Case: అభం శుభం తెలియని ఐదున్నర ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ కామాంధుడికి కేరళలోని పాలక్కాడ్​ కోర్టు గట్టి షాకిచ్చింది. ఏకంగా 46 ఏళ్ల జైలు శిక్ష, రూ.2.75 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు బుధవారం తీర్పును వెల్లడించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. 2019లో ఈ దారుణం జరిగింది. కొంగడ్ పట్టణంలో నివాసించే బాధితురాలి ఇంట్లోకి అర్ధరాత్రి నిందితుడు చొరబడ్డాడు. అనంతరం చిన్నారిని బలవంతంగా తీసుకుని.. పొలంలోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు పోలీసులు. 16 మందిని విచారించిన పోలీసులు.. 15 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించారు. బుధవారం విచారణ జరిపిన కోర్టు.. నిందితుడికి 46 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ, అన్ని శిక్షలు ఏకకాలంలో అమలవ్వడం వల్ల 20 ఏళ్లు మాత్రమే నిందితుడు జైలులో ఉంటాడు.

ABOUT THE AUTHOR

...view details