తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Weekly Horoscope : ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - తెలుగులో రాశి ఫలాలు

Weekly Horoscope : జనవరి (22 - 28) వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

2023 january 22nd to 28th weekly horoscope
ఈ వారం మీ రాశి ఫలం

By

Published : Jan 22, 2023, 6:46 AM IST

Weekly Horoscope: జనవరి (22 - 28) వరకు మీ రాశి ఫలాల గురించి డాక్టర్‌ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి ఏమన్నారంటే?

ఉద్యోగంలో విజయం ఉంది. నమ్మకంగా పనిచేయండి, కోరుకున్న ఫలితం వస్తుంది. విశేషమైన లాభాలుంటాయి. ఖర్చు తగ్గించాలి. భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సౌమ్య సంభాషణ మేలు. అదృష్టయోగముంది. ఎదురుచూస్తున్న పనిలో పురోగతి ఉంటుంది. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. నవగ్రహశ్లోకాలు చదివితే మేలు.

ఉత్తమస్థితి గోచరిస్తోంది. బాధ్యతలను పూర్తిచేయండి. పనిని మధ్యలో ఆపవద్దు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. అధికార లాభం సూచితం. నిర్ణయాలను ధైర్యంగా అమలుచేయండి. ఇంట్లోవారి సూచనలు పాటించండి. అందరినీ నమ్మవద్దు. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. నవగ్రహ శ్లోకాలు చదవండి, మానసిక స్థైర్యం పెరుగుతుంది.

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. విఘ్నాలు ఉంటాయి, సమయస్ఫూర్తితో అధిగమించాలి. ఒక మెట్టు తగ్గి అయినా పనులను పూర్తి చేసుకోవాలి. మిత్రుల అండ లభిస్తుంది. అవసరాలకు ధనం లభించినా వ్యయం పెరుగుతుంది. సంకోచం పనికిరాదు. మోసం చేసేవారుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. సౌమ్యంగా సంభాషించండి. నవగ్రహ దర్శనంతో దోషవిముక్తి కలుగుతుంది.

అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష లాభాన్నిస్తాయి. ఆలోచించి అమలు చేయండి. క్రమంగా వృద్ధిని సాధించండి. ధైర్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చంచలత్వం లేకుండా పనిచేస్తే గొప్ప భవిష్యత్తు లభిస్తుంది. ఇష్టదైవాన్ని స్మరించండి, ఆనందించే అంశముంటుంది.

ఉద్యోగంలో అభీష్టసిద్ధి ఉంటుంది. సకాలంలో పని పూర్తిచేయండి. ప్రతిభతో పెద్దలను మెప్పించాలి. వ్యాపారం మిశ్రమంగా ఉంటుంది. దుర్భర పరిస్థితులు తలెత్తవచ్చు. ధైర్యంగా ఉండాలి. మిత్రుల సహాయం అవసరం. మొహమాటంతో సమస్యలు రానివ్వద్దు. వారాంతానికి కృషి ఫలిస్తుంది. కుజశ్లోకం చదివితే మంచిది.

వ్యాపారలాభం విశేషం. కాలానుగుణమైన మార్పులతో లాభాలు పొందుతారు. పలుమార్గాల్లో పైకి రావటానికి అవకాశాలు ఉంటాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. కొన్ని విషయాల్లో పురోగతి లభిస్తుంది. నిరాశ చెందితే ఫలితం ఉండదు. కృషిని బట్టి విజయం ఉంటుంది. ప్రతిభను నిరూపించుకునే సమయం. సూర్యస్తుతి మేలుచేస్తుంది.

ముఖ్యకార్యాల్లో శ్రద్ధ అవసరం. అడుగడుగునా ఆటంకాలు ఉంటాయి. తెలివిగా నిర్ణయం తీసుకోవాలి. ముందస్తు ప్రణాళికలతో సమస్యల్ని నివారించవచ్చు. గందరగోళ స్థితి ఉంటుంది. సహనానికి పరీక్షా కాలం లాగా అనిపిస్తుంది. సమష్టి నిర్ణయం తోడ్పడుతుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్తపడాలి. నవగ్రహధ్యానంతో మనశ్శాంతి చేకూరుతుంది.

శుభకాలం నడుస్తోంది. మంచి పనులకు శ్రీకారం చుట్టండి. అనేకవిధాలుగా మేలు జరుగుతుంది. ధర్మబద్ధంగా చేసే పనులు త్వరగా విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. తగినంత గుర్తింపు ఉంటుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తూ ముందుకు సాగండి. ధనలాభం విశేషంగా ఉంది. ఇష్టదేవతను స్మరించండి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి.

ఉత్సాహం ముందుకు నడిపిస్తుంది. లక్ష్యాన్ని సాధించేందుకు క్రమశిక్షణతో కృషిచేయండి. స్వల్ప ఆటంకాలున్నా పెద్ద ఇబ్బందేమీ ఉండదు. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. తడబాటు లేకుండా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. సూర్యధ్యానం శుభం కలుగజేస్తుంది.

ఆర్థికంగా శుభఫలితం, అభీష్ట సిద్ధి గోచరిస్తున్నాయి. తోటివారినుంచి కొంత ఇబ్బంది ఉంటుంది. జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. శత్రుభావన మంచిది కాదు. వ్యాపారంలో అనుకున్న ఫలితం వస్తుంది. నిరాశ చెందకుండా ప్రయత్నించాలి. అపార్థాలకు తావివ్వవద్దు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శివధ్యానం శక్తినిస్తుంది.

వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. అభీష్టసిద్ధి కలుగుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఉద్యోగంలోనూ సమస్యలు ఉండవు. ప్రతిభతో పెద్దల్ని ప్రసన్నుల్ని చేసుకుంటారు. నిర్మలమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్నిస్తాయి. ధర్మం గెలిపిస్తుంది. వారాంతంలో శుభం జరుగుతుంది. విష్ణుసహస్రనామం చదవండి, మనోబలం సిద్ధిస్తుంది.

ఉద్యోగులకు విశేష శుభం ఉంది. కాలం కలిసి వచ్చి సత్ఫలితాలు పొందుతారు. పదోన్నతులు ఉంటాయి. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. దేనికీ వెనకడుగు వేయవద్దు. సమష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆశయం నెరవేరుతుంది. వాక్చాతుర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి, శుభం జరుగుతుంది.

ABOUT THE AUTHOR

...view details