తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు! - 2000 bullets recovered in delhi

పంద్రాగస్టు వేడుకలకు ముందు దిల్లీలో 2వేల తూటాలు దొరకడం కలకలం రేపింది. ఆరుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

2000 bullets recovered in delhi
దిల్లీలో కలకలం.. 2వేల తూటాలు స్వాధీనం.. ఉగ్ర కోణంలో దర్యాప్తు!

By

Published : Aug 12, 2022, 1:50 PM IST

స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు చేసిన కుట్రను దిల్లీ పోలీసులు భగ్నం చేశారు. దిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అక్రమంగా రవాణా చేస్తోన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద ఎత్తున తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

పంద్రాగస్టు వేళ ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే ఆనంద్ విహార్‌ ప్రాంతంలో సోదాలు చేపడుతుండగా కొందరు అనుమానాస్పదంగా కన్పించారు. దీంతో విచారణ జరిపి పోలీసులు ఆరుగుర్ని అరెస్టు చేశారు. నిందితులు ఆయుధాల స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 2వేల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది నేరస్థుల ముఠా స్మగ్లింగ్​లో భాగమై ఉంటుందని భావిస్తున్నా.. ఉగ్రవాద కోణాన్ని విస్మరించలేమని చెప్పారు. ఇటీవల దిల్లీలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details