కేరళలో జికా వైరస్ అంతకంతకూ వ్యాపిస్తోంది. రాజధాని తిరువనంతపురంలో ఇద్దరు వ్యక్తులకు పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో నమోదైన జికా కేసుల సంఖ్య 30కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
కేరళలో జికా విజృంభణ- కొత్తగా డెంగ్యూ కేసులు! - జికా జికా
కేరళలో మరో రెండు జికా వైరస్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 30కి పెరిగాయని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. డెంగ్యూ కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పారు.
కేరళ జికా డెంగ్యూ
తాజాగా నమోదైన రెండు కేసులు తిరువనంతపురం మెడికల్ కళాశాలలో బయటపడ్డాయని మంత్రి వెల్లడించారు. జికాతో పాటు వివిధ జిల్లాల్లో డెంగ్యూ కేసులు సైతం వెలుగులోకి వస్తున్నట్లు చెప్పారు. జికా నివారణకు ఏడు రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:రేపటి పౌరులకు కొత్త బోధనాంశాలు