దిల్లీలోని మజ్ను కా తిల్లా ప్రాంతంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.60 కోట్లు ఉంటుందని అధికారుల అంచనా. నిందితులను షాజాద్ (26), అమిర్ ఖాన్ (24)లగా గుర్తించారు. వీరు అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన వారని పేర్కొన్నారు.
"బిహార్, బంగాల్, మణిపుర్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల నుంచి దిల్లీకి ఈ ముఠా మాదకద్రవ్యాలను చేరవేస్తోంది. ఈ ముఠాకు చెందిన ఇద్దరు మజ్ను కా తిల్లా ప్రాంతానికి రానున్నారని మాకు సమాచారం అందింది. పథకం ప్రకారం వారిని అరెస్టు చేశాము. భారత్- మయన్మార్ సరిహద్దు ప్రాంతాల నుంచి బంగాల్, బిహార్ సహా ఈశాన్య రాష్ట్రాలకు మాదకద్రవ్యాలు పంపిణీ అవుతున్నాయని నిందితులు వెల్లడించారు."