Jammu and Kashmir Accident: బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జమ్ముకశ్మీర్ ఉద్దక్ ప్రాంతంలోని రామ్‌నగర్ వద్ద జరిగింది. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని ఉధమ్‌పుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కోగెర్మార్గ్కు వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి.. 25 మందికి గాయాలు - జమ్ముకశ్మీర్ రోడ్డు ప్రమాదం
Jammu and Kashmir Accident: జమ్ముకశ్మీర్‌లోని ఉద్ధక్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 25 మంది గాయపడ్డారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన ఉన్న వారిపై ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Dumper Truck Accident: మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో మరో దుర్ఘటన జరిగింది. మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. "మృతులు గబ్రు యాదవ్, అనితా రాఠోడ్, సారికాలుగా గుర్తించాము. ఖర్గోన్కు వెళ్లాల్సిన వీరు రోడ్డు పక్కనే ఉన్న గార్డెన్ వద్ద కూర్చోని భోజనం చేస్తుండగా ట్రక్కు దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు" అని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...