YouTube channels banned: భారత్‌పై దుష్ప్రచారం చేస్తున్న 16 యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేసింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. ఇందులో పాకిస్థాన్‌కు చెందిన 6 న్యూస్ ఛానళ్లు కూడా ఉన్నాయి. భారత జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి ఇవి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం ఈ చర్యలకు ఉపక్రమించింది.
భారత్‌పై దుష్ప్రచారం.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్ - బ్యాన్
YouTube channels block: భారత్‌పై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది కేంద్ర సమాచార ప్రసారాల శాఖ. మొత్తం 22 ఛానళ్లను బ్లాక్ చేసింది.
యూట్యూబ్ ఛానళ్లతో పాటు భారత్‌పై దుష్ప్రచారం చేస్తోందన్న కారణాలతో ఓ ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసింది కేంద్రం. ఈ యూట్యూబ్ ఛానళ్లు, ఫేస్బుక్ అకౌంట్‌కు మొత్తంగా 68 కోట్ల వీక్షకులు ఉన్నారు. 'తప్పుడు, ధ్రువీకరించని సమాచారం భయానక వాతావరణాన్ని, మతపరమైన చిచ్చుకు కారణమవటమే కాకుండా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఐటీ నిబంధనలు, 2021లోని రూల్ 18 ప్రకారం డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ఎవరూ సమాచారం అందించలేదు.' అని సమాచార, ప్రసారాల శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి:భారత్‌కు వ్యతిరేకంగా ఫేక్ న్యూస్.. 35 పాక్ యూట్యూబ్ ఛానళ్లు బ్యాన్