కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'కేంద్ర హోంమంత్రి మెడల్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్' అవార్డుకు 152 మంది పోలీసు అధికారులు ఎంపికయ్యారు. ఇందులో 15 మంది సీబీఐ నుంచి ఉన్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.
ఇక రాష్ట్రాల వారిగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఐదుగురు చొప్పున ఈ మెడల్‌కు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 11 మంది చొప్పున పోలీసులను ఈ అవార్డు వరించింది. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 10, కేరళ, రాజస్థాన్ల నుంచి 9 మంది చొప్పున,తమిళనాడు నుంచి ఎనిమిది మంది పోలీసులు మెడల్ అందుకోనున్నారు.
బిహార్ నుంచి ఏడుగురు, గుజరాత్, కర్ణాటక, దిల్లీ నుంచి ఆరుగురి చొప్పున ఈ మెడల్‌కు ఎంపిక అయ్యారు. మొత్తం జాబితాలో 28 మహిళా పోలీసు అధికారులు సైతం చోటు దక్కించుకున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.