తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే కుటుంబంలో 150 మందికి ఆరు వేళ్లు.. ఎందుకో తెలుసా?

150 Family Members Have above 20 Fingers : హరియాణాలో ఒకే కుటుంబానికి చెందిన 150 మంది కాళ్లకు గానీ లేదా చేతులకుగానీ ఆరువేళ్లను కలిగి ఉన్నారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారికి ఆరు వేళ్లు ఎందుకు ఉన్నాయో? అందుకు వాళ్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? తెలుసుకుందామా మరి.

150 Family Members Have Six Fingers
150 Family Members Have Six Fingers

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 6:25 PM IST

150 Family Members Have above 20 Fingers :సాధారణంగా ఒక మనిషికి కాళ్లు, చేతులకు కలిపి 20 వేళ్లు ఉంటాయి. కొందరికి చేతులు లేదా కాళ్లకు ఆరువేళ్లు ఉంటుంటాయి. అయితే హరియాణాలోని పానీపత్​కు చెందిన ఒకే కుటుంబంలోని 150 మందికి చేతులు లేదా కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయి. అదేంటి ఒకే కుటుంబానికి చెందినవారికి ఇలా అవ్వడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివేయండి.

పానీపత్​లోని బాబర్​పుర్​కు చెందిన జానీ కుటుంబంలోని 150 మందికి కాళ్లు లేదా చేతులకు ఆరు వేళ్లు ఉన్నాయి. మొత్తం కలిపి తమ కుటుంబంలోని 150 మందికి 20 వేళ్లకుపైగా ఉన్నాయని కుటుంబ సభ్యుడు జానీ చెప్పాడు. తన తండ్రి కాలికి ఆరు వేళ్లు ఉండేవని.. పెద్ద కుమారుడికి సైతం కాళ్లకు ఆరు వేళ్లు ఉన్నాయని తెలిపాడు. ఇలా కాళ్లు లేదా చేతులకు 6వేళ్లు ఉండడం తమకు ఎలాంటి సమస్య అనిపించదని పేర్కొన్నాడు. అయితే చెప్పులు, షూస్ వేసుకునే సమయంలో కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందని అన్నాడు. తన కుటుంబంలో కొంత మంది బాబర్‌పుర్​లో.. మరికొందరు పానీపత్​ పక్కనే ఉన్న నోహ్రా గ్రామంలో నివసిస్తున్నారని వివరించాడు.

జానీ కుటుంబ సభ్యులు
కాలికి ఆరు వేళ్లు కలిగి ఉన్న జానీ కుటుంబీకులు

ఇంతకీ వైద్యులు ఏమంటున్నారంటే?
ఒకే కుటుంబంలో చాలా మంది ఆరు వేళ్లతో పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ అంటారని వైద్యాధికారి డాక్టర్ జైన్​శ్రీ తెలిపారు. శరీరంలోని క్రోమోజోములు, జీన్స్ ప్రభావం వల్ల ఇలా జరుగుతుందని చెప్పారు. జీన్స్ ప్రభావం వల్ల తల్లిదండ్రుల నుంచి సంతానానికి పాలీడాక్టిలీ సంక్రమిస్తుందని తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పెద్ద కుమారుడికి పాలీడాక్టిలీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హోమియోపతిలో దీని చికిత్స సాధ్యమవుతుందని చెప్పారు.

కాలికి ఆరు వేళ్లు కలిగి ఉన్న జానీ కుటుంబీకులు

Baby Born With 26 Fingers In Rajasthan :రాజస్థాన్​లో కొద్ది రోజుల క్రితం ఓ నవజాత శిశువు 26 వేళ్లతో జన్మించింది. ఆ చిన్నారి చెరో చేతికి 7 వేళ్లు ఉండగా.. ఒక్కో కాలికి ఆరు వేళ్లు చొప్పున మొత్తం 26 ఉన్నాయి. ఆ బిడ్డను ఆమె కుటుంబ సభ్యులు దేవతగా భావిస్తున్నారు. చిన్నారి పుట్టుక పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

కాలికి 9 వేళ్లతో శిశువు జననం!

4 తరాలుగా ఆ కుటుంబంలో ప్రతిఒక్కరికి 24 వేళ్లు

ABOUT THE AUTHOR

...view details