మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న1,350 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసున్నారు. దాని విలువ రూ.2.70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముందస్తు సమాచారంతో గ్వాలియర్ నుంచి ఆగ్రా వైపు వెళ్తున్న ట్రక్‌ను తనిఖీ చేశారు పోలీసులు. దీంతో గంజాయి బయటపడింది.
రూ.2 కోట్ల గంజాయి పట్టివేత-ఇద్దరి అరెస్ట్ - రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం
మధ్యప్రదేశ్‌లో భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2.70 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.
గంజాయి స్వాధీనం
ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్-ఇద్దరు మావోయిస్టులు హతం