మహారాష్ట్ర ముంబయిలోని జేజే ఆసుపత్రిలో బ్రిటిష్ కాలం నాటి పురాతన సొరంగం బయటపడింది. ఆసుపత్రి ప్రాంగణంలో అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో భూమి లోపల ఓ దారి కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. లోపలికి తవ్వి చూస్తే అది ఒక సొరంగంగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఇది సుమారుగా 200మీటర్ల పొడవు ఉన్నట్లు ఆస్పత్రి వైద్యుడు అరుణ్ రాథోడ్ వెల్లడించారు. ఈ సొరంగ మార్గం డెలివరీ వార్డు నుంచి చిల్లపిల్లల వార్డు వరకు ఉన్నట్లు గుర్తించారు.
ఆస్పత్రిలో బ్రిటిష్ కాలం నాటి సొరంగ మార్గం.. ఎక్కడి వరకు ఉందో తెలుసా? - 130 ఏళ్ల సొరంగం మార్గం
ముంబయిలోని జేజే ఆసుపత్రిలో బ్రిటిష్ కాలం నాటి పురాతన సొరంగం వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ సొరంగం బయటపడింది. 130 సంవత్సరాల క్రితం దీని నిర్మాణం జరిగినట్లుగా అధికారులు భావిస్తున్నారు.
దీన్ని 130 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా భావిస్తున్నారు. పురావస్తు శాఖకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే 177 సంవత్సారాల క్రితం ఈ పురాతన అసుపత్రిని నిర్మించారు. సర్ జమ్షేడ్జీ జిజిభాయ్, సర్ రాబర్ట్ గ్రాంట్ సహకారంతో దీని నిర్మాణం చేపట్టారు. ఆసుపత్రి వాస్తు కోసం సర్ జమ్షేడ్జి జిజిభాయ్ అప్పట్లోనే లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.
ఇదివరకు ఎన్నో..
జేజేడీఎమ్ ఆసుపత్రిలో ప్రాంగణంలో పురాతన సొరంగం ఒకటి వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇదేమి కొత్త విషయం కాదు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సొరంగ మార్గాలు, సబ్వేలు బయటపడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రితం సెయింట్ జార్జ్ ఏరియాలో ఒక సొరంగ మార్గం బయటపడింది.