జమ్ము కశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు సామాన్యులపైకి దాడికి తెగబడ్డారు. కాకాపొరలో ముష్కరులు చేసిన గ్రనేడ్ దాడిలో 12 మంది పౌరులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
పుల్వామాలో గ్రనేడ్ దాడి- 12 మందికి గాయాలు - గ్రనేడ్ దాడిలో పౌరులకు గాయాలు
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. పుల్వామా జిల్లాలో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 12 మంది పౌరులకు తీవ్రంగా గాయాలయ్యాయి.
పుల్వామా గ్రనేడ్ దాడి- 12 మంది పౌరులకు తీవ్ర గాయాలు
"గ్రనేడ్ రోడ్డు మీదే పేలడం వల్ల 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించాం" అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో బలగాలు తనిఖీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.