తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిడ్డకు జన్మనిచ్చిన 11 ఏళ్ల బాలిక.. పెళ్లి పేరుతో నమ్మించి, మోసగించి... - Baby boy

Girl gave Birth to Baby Boy: 11 ఏళ్ల మైనర్​.. బిడ్డకు జన్మనిచ్చింది. పంజాబ్​ లుధియానాలో ఈ ఘటన జరిగింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మరో మైనర్​ అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

11-year-old girl gave birth to a baby boy In Ludhiana
11-year-old girl gave birth to a baby boy In Ludhiana

By

Published : Mar 15, 2022, 2:11 PM IST

Updated : Mar 15, 2022, 2:24 PM IST

Girl gave Birth to Baby Boy: పంజాబ్​ లుధియానాలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 11 ఏళ్ల బాలిక.. మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మైనర్​.. బాధితురాలిని మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు. బాలిక తండ్రి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు.. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ జరిగింది..

బాధితురాలు ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి కొన్ని నెలల క్రితం ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు.. సమీపంలోని ఓ మహిళకు చెప్పారు. సాయం చేస్తుందనుకున్న ఆమె.. నిందితుడి నుంచి డబ్బులు ఇప్పిస్తానని చెప్పడం గమనార్హం. దీనికి వారు నిరాకరించగా.. బాధితురాలిని తన వెంట తీసుకెళ్లి తీవ్రంగా వేధించింది.

దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. వారు బాలికను విడిపించి ఆస్పత్రికి తరలించారు. అక్కడే బాధితురాలు ప్రసవించింది. పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఆరేళ్ల బాలికపై అత్యాచారం..

దిల్లీ శాహ్​బాద్​ డైరీ ప్రాంతంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. మార్చి 10న ఇంటి బయట ఆడుకుంటుండగా.. బాలిక అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబసభ్యులు. కిడ్నాప్​ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె కోసం గాలించారు. మరుసటి రోజే.. నిందితుడు బాలికను ఇంటి ముందు పడేసి పరారయ్యాడు. ఆ చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని వెతికే పనిలో పడ్డారు.

ఇవీ చూడండి:కబడ్డీ ఆటగాడిని కాల్చిచంపిన దుండగులు

నాలుగేళ్లు మౌనంగా ఏడ్చింది.. అదే కామాంధుడు చెల్లినీ వేధించేసరికి..

Last Updated : Mar 15, 2022, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details