కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాల ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరు జిల్లాల్లో రెడ్ అలెర్ట్‌ను (Kerala Red Alert) ప్రకటించింది. పథనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కీ, త్రిశూర్, పాలక్కడ్ జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్..
రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టనున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. ఇందుకోసం 11 బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ప్రభావిత ప్రాంతాలు సహా వరదలు తీవ్రమయ్యే (Kerala Red Alert) అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఈ చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఎన్డీఆర్ఎఫ్ డైరక్టర్ ఎస్ఎన్ ప్రధాన్ ట్వీట్ చేశారు. మలప్పురం, అలప్పుజా, ఎర్నాకులం, త్రిశూర్, పథనంతిట్ట, పాలక్కడ్, కొట్టాయాం, కన్నూర్, కొల్లాలం, ఇడుక్కీ ప్రాంతాల్లో ఈ బృందాలు సహాయక చర్యలు చేపడతాయని ప్రధాన్ పేర్కొన్నారు.
మరోవైపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు (Kerala Rain Update) అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డ్యాం పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.