Delhi Police Corona: కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. దిల్లీలో తాజాగా దాదాపు 1000 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, దిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ చిన్మయ్ బిశ్వాల్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్ నిర్ధరణ అయినవారంతా ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
దిల్లీలో కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా.. దిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానా.. ఇదివరకే పోలీస్ సిబ్బందికి పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. పోలీస్ సిబ్బంది ఫ్రంట్‌లైన్ వారియర్స్‌లో భాగం కాబట్టి వైరస్ బారిన పడకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అందులో ఉంది.
పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించేటప్పుడు మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలి, శానిటైజర్లు వాడాలని నిబంధనల్లో ఉంది. పోలీస్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని నిబంధనల్లో సూచించారు.
దిల్లీలో మొత్తం 80వేలకుపైగా పోలీస్ సిబ్బంది ఉన్నారు.