తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 11:36 PM IST

ETV Bharat / bharat

100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా

హిమాచల్​ ప్రదేశ్​ ధర్మశాలలోని ఓ బౌద్ధ ఆశ్రమంలో ఒక్కరోజే 100 మంది సన్యాసులకు కరోనా పాజిటివ్​గా తేెలింది. ఇప్పటివరకు ఆ ఆశ్రమంలో 156 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​​ జోన్​గా ప్రకటించారు.

100 monk found corona positive in dharamshala
ఒక్కరోజే 100 మంది సన్యాసులకు కరోనా

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కలవరాని గురి చేస్తోంది. ధర్మశాలలోని గ్యుటో ఆశ్రమంలో సోమవారం ఒక్క రోజే 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది.

కంటైన్​‌మెంట్ జోన్‌గా..

గ్యుటో ఆశ్రమ ప్రాంతాన్ని కంటైన్​మెంట్​ జోన్​గా ప్రకటించినట్లు కాంగ్రా జిల్లా ముఖ్య వైద్యాధికారి డా.దర్శన్​ గుప్తా తెలిపారు. ఈ ఆశ్రమంలో ఇప్పటివరకు మొత్తం 156 బౌద్ధ సన్యాసులకు కొవిడ్​ సోకినట్లు చెప్పారు. ఆశ్రమంలో ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఎలా నమోదయ్యాయో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

హిమాచల్​ప్రదేశ్​లో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు.. కొన్ని ప్రాంతాల్లో వైరస్​ కట్టడి చర్యలను కఠినతరం చేశారు.

ఇదీ చూడండి:'కరోనా టీకా తీసుకోం- వ్యాక్సినేషన్​ అడ్డుకోం'

ABOUT THE AUTHOR

...view details