దేశంలో కొత్త రకం కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవలే బ్రిటన్ నుంచి కర్ణాటకు వచ్చిన 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కె.సుధాకర్ తెలిపారు. పరీక్షల కోసం నమూనాలను బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌కు పంపిచినట్లు వెల్లడించారు.
రెండు, మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయని అన్నారు. ఫలితాలు వచ్చిన తరువాత కొత్త రకం కరోనా వైరసా? కాదా? అన్నది తేలుతుందని పేర్కొన్నారు. నవంబర్25 నుంచి డిసెంబర్ 22 వరకు 2,500 మంది రాష్ట్రానికి వచ్చారని ఇదివరకే మంత్రి తెలిపారు.