కర్ణాటక మైసూరు ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా (Mysore Palace Dasara) జరిగిన దసరా ఉత్సవాలు.. అద్వితీయ జంబూ సవారీతో (Jamboo Savari Mysore) శుక్రవారం ముగిశాయి. కాగా.. రాయల్ ప్యాలెస్ మాత్రం మరో 9 రోజుల పాటు కాంతులీననుంది. పర్యటకుల కోసం ప్యాలెస్‌ను దీపకాంతులతో ముస్తాబుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM News) ఈ మేరకు ఆదేశించారు.
ఏటా వేలాది మంది ప్రజల మధ్య ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు (Karnataka Dasara Celebration) కరోనా కారణంగా ఈసారి అనేక ఆంక్షల మధ్య నిర్వహించారు. అయితే కరోనా నిబంధనలను అనుసరించి శతాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాలను కొనసాగించారు.
ఆకట్టుకున్న జంబూ సవారీ..
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వడయార్ వంశానికి (Wadiyar Dynasty) చెందినవారే ఉత్సవాలు నిర్వహించారు. వడియార్ వంశ.. కులదైవమైన చాముండేశ్వరి దేవిని.. ఏనుగులపై ఊరేగింపుగా ప్యాలెస్‌కు తీసుకువచ్చారు.