Reservation for transgenders: లింగ వివక్షతను రూపుమాపేలా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్(కేఎస్ఆర్పీ), ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లో (ఐఆర్బీ) స్పెషల్ రిజర్వ్ సబ్- ఇన్స్పెక్టర్ పోస్టులకుగాను మహిళలు, పురుషులతో పాటు ట్రాన్స్జెండర్లూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Transgenders in karnataka police: కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాలకు సంబంధించి సోమవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 70 ఖాళీలు ఉన్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు జనవరి 18 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లు ఒక శాతం రిజర్వేషన్ పొందుతారని స్పష్టం చేసింది.
అయితే.. ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ట్రాన్స్జెండర్ అభ్యర్థులు జిల్లా కలెక్టర్ జారీ చేసిన 'ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్'ను సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే.. వారి దరఖాస్తును తిరస్కరిస్తారు. "కర్ణాటక రాష్ట్ర పోలీసు శాఖ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది. మేము మహిళలు, పురుషులను, ట్రాన్స్జెండర్లను పోలీసు ఉద్యోగాల్లో నియమించుకుంటాం" అని ట్విట్టర్ వేదికగా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ పేర్కొన్నారు.
దేశంలోనే మొదటి రాష్ట్రం..