తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్మాణ సంస్థలపై వేటు!

దిల్లీలో వాయు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘించిన 12 నిర్మాణ సంస్థలపై వేటు వేసింది పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఈ సంస్థలపై రూ.1.59కోట్ల జరిమానా విధించింది. అన్ని చోట్ల వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది.

1 crore fine levied as environment compensation against non compliant construction and demolition entities
ఎన్‌సీఆర్‌ పరిధిలో నిర్మాణ సంస్థలపై వేటు!

By

Published : Jan 4, 2021, 10:33 PM IST

దేశ రాజధాని పరిధిలో వాయు కాలుష్య నిబంధనల్ని ఉల్లంఘించిన పలు నిర్మాణ సంస్థలపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిపి వాయుకాలుష్యానికి కారణమైన 12 సంస్థలపై రూ. 1.59 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

'దేశరాజధాని పరిధిలో గత నెల 24 నుంచి 31 వరకు నిబంధనలు ఉల్లంఘించిన కాలుష్యానికి కారకులైన వారిపై.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ ప్రత్యేక కమిటీలు మూడు వేల ప్రదేశాల్లో పరిశీలన జరిపగా.. 386 చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించాయి. వీటిలో.. 12 ప్రదేశాల్లో జరిగిన నిర్మాణాలు కాలుష్యాన్ని అత్యధికంగా పెంపొందించేలా ఉన్నందున జరిమానా విధించేందుకు దిల్లీ సహా పరిసర రాష్ట్రాల కాలుష్య మండళ్లకు సిఫారసు చేశాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి 12 చోట్ల జరిగిన ఉల్లంఘనలపై రూ.1.59 కోట్ల జరిమానా విధించి.. అన్ని చోట్ల వెంటనే నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వినియోగించిన వాహనాలపై కూడా రూ.1.17 కోట్ల విధించింది.' అని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ రాజధాని పరిధిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ 224 ప్రత్యేక బృందాలను ఇదివరకే ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details