వరుణ జాతర... వర్షం కురవాలని అభిషేకాలు - temples
సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ కృష్ణా జిల్లా తిరువూరులో ప్రజలు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలోని పలు మండలాల్లో భక్తులు దేవుళ్లకు జలాభిషేకం నిర్వహించారు. నూతన వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ జాతరను వేడుకగా నిర్వహించారు.