తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు - సంక్రాంతి సంబరాలు
మకర సంక్రాంతి మూడురోజుల పండగ. తెలుగు లోగిళ్లలో ఈ పండగ వచ్చిందంటే ఊళ్ల.. కళే మారిపోతుంది. ఎక్కడ చూసినా.. పండగ వాతావరణమే కనిపిస్తుంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు... ఆప్యాయతానురాగాలు... పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండుగలో.. భోగి, సంక్రాంతి, కనుమ ప్రత్యేకం.