ప్రతిధ్వని: ఉన్నత విద్యలో అమ్మభాషకు అందలం సాధ్యమేనా? - మాతృభాషలో బోధనపై ప్రతిధ్వని చర్చ
దేశంలో ఇంజినీరింగ్, వైద్య విద్యను మరింత మెరుగుపరచడానికి బోధన, అధ్యయనాన్ని మరింత పెంపొందించడానికి అమ్మ భాషకు అందలం వేయాలనుకుంటోంది కేంద్రం. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే... సాంకేతిక, వైద్య విద్యలో భోదన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు మాతృభాషకు అందలం వేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించగా... తాజాగా ప్రధాని నోటి వెంట కూడా ఇదే మాట వచ్చింది. అమ్మ భాషలో విద్యా బోధన జరగడం వల్ల ప్రజా సమస్యలను అర్దం చేసుకోవడంతోపాటు వాటి పరిష్కారం కూడా సులభమవుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో సాంకేతిక, వైద్య విద్యలో మాతృభాషలో బోధనపై ఎదురవుతున్న సవాళ్లు, బోధన అవకాశాల వంటి వాటిపై ఇవాళ ప్రతిధ్వని చర్చ.