PRATHIDWANI: రుణయాప్‌లపై కేంద్రం కొరడా.. ఇకనైనా అడ్డుకట్ట పడేనా..?
PRATHIDWANI: అడగక ముందే రుణాలు.. అడ్డగోలు వడ్డీలు! ఆ పై అడ్డూఅదుపు లేని వేధింపులు! ఫలితం.. వేలకొద్దీ ఫిర్యాదులు.. పదుల సంఖ్యలో బలవన్మరణాలు! దేశవ్యాప్తంగా రుణయాప్‌ల దారుణాలు, అరాచకాలకు బలైనవారిలో బడుగు జీవులు, విద్యార్థులు, నిరుద్యోగులు, చిరుద్యోగులే అత్యధికం. ఆపదలో ఆదుకోవడానికి రుణాలు ఇచ్చినట్లే ఇచ్చి.. ఆపై అభాగ్యుల ప్రాణాలు తోడేస్తున్న ఆ ఆన్లైన్ రుణయాప్పై ఎట్టకేలకు కొరడా ఝళిపించిది కేంద్రప్రభుత్వం. చట్టబద్ధమైన యాప్‌ల జాబితా సిద్ధం చేయాలని.. అవి మాత్రమే యాప్ స్టోర్లలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది. మరి ఇకనైనా ఆ దారుణాలకు అడ్డుకట్ట పడుతుందా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.