పరవళ్లు తొక్కుతున్న పాలేరు వాగు - jaggayyapeta latest news
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని పాలేరు వాగు జలకళను సంతరించుకుంది. తెలంగాణాలో కురుస్తున్న వర్షాల కారణంగా పాలేరుకు భారీగా నీరు పెరిగింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని పరీవాహక గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.