ప్రతిధ్వని: వర్షాలతో పంట నష్టం.. రైతులకు ప్రభుత్వాల సాయం..! - etv prathidwani debates
భారీ వర్షాలు, వరదలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటలు తీవ్రస్థాయిలో నష్టపోయాయి. కృష్ణా, గోదావరి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడం వల్ల లక్షల ఎకరాల పంట.. నీటమునిగింది. ఏపీలో పత్తి, మిరప, వరి, ఉద్యానవన పంటలు నీటమునిగాయి. తెలంగాణలో పత్తి, మిరప, కంది వంటి పంటలు బాగా దెబ్బతిన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో పంట నష్టం జరిగింది.. ఏయే పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. ఈ దశలో పంటలను కాపాడుకునే అవకాశం ఎంత వరకు ఉంది.. ప్రభుత్వాలు.. రైతులను ఏ మేరకు ఆదుకోవాలి.. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ..!