Prathidwani: హైదరాబాద్‌లోని పబ్‌లపై.. అసలు పర్యవేక్షణ ఉందా..? - pd on pub culture
మైనర్‌పై అత్యాచార ఘటన ప్రకంపనలు కొనసాగుతునే ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా ఇప్పుడు అదే అంశంపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. హేయమైన నేరంలో నిందితులు కూడా మైనర్లే ఉండడాన్ని ఎలా చూడాలి? అసలు ఆ వయసు వారిని పబ్‌ల్లోకి అనుమతించడం ఏమిటి..? వరస ఘటనల్లో వివాద కేంద్రాలుగా ఉంటున్న నగరంలోని పబ్‌లపై అసలు పర్యవేక్షణ ఉందా..? పోలీసులు, ఆబ్కారీశాఖలు వాటి పనిని పకడ్బందీగా నిర్వహిస్తున్నాయా..? ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర అన్నట్లు.. సంస్కృతి, మానవతా విలువలు, సరైన పెంపకం విషయంలో గమనించాల్సినవి ఏమిటి? ఇదే అంశంపై నేటి "ఈటీవీ భారత్" ప్రతిధ్వని..