Prathidhwani భవిష్యత్‌లోనూ యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు ఉండవా - UPI payment system in india
Prathidhwani దేశంలో యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేసేందుకు రిజర్వ్‌బ్యాంకు తెరపైకి తెచ్చిన చర్చకు కేంద్రం ముగింపు పలికింది. ఇప్పట్లో యూపీఐ ఆధారిత చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. అయితే... భవిష్యత్‌లో యూపీఐ చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం ఛార్జీల పరిధిలోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.2వేలకు మించి జరిపే యూపీఐ ఆధారిత డెబిట్ కార్డుల చెల్లింపుల్లో ఛార్జీలు వసూలు అమలులో ఉంది. దీనికి తోడు క్రెడిట్ కార్డు-యూపీఐ చెల్లింపులపై పన్ను వసూలు చేయాలని బ్యాంకులు ప్రతిపాదిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అసలు యూపీఐ చెల్లింపుల ప్రక్రియలో బ్యాంకులు నిర్వహించే పాత్ర ఏంటి? డిజిటల్ పేమెంట్స్ వేదికలు ఏఏ సేవలకు పన్నులు వసూలు చేస్తున్నాయి? యూపీఐ చెల్లింపులపై ప్రజలకు ఎలాంటి అవగాహన అవసరం అనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ.
Last Updated : Aug 27, 2022, 11:11 PM IST