Prathidhwani రాష్ట్రాలు మద్యంపైనే ఎందుకు ఆధారపడుతున్నాయి ? - ప్రతిధ్వని చర్చ
prathidhwani దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు మద్యం అమ్మకాలు ప్రధాన ఆదాయవనరుగా మారాయి. గడిచిన మూడేళ‌్లలో మద్యం అమ్మకాల ఆదాయాలు 34 శాతం పెరిగాయి. కరోనా సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదొడుకులకు గురైన సమయంలోనూ మద్యం అమ్మకాలు రాష్ట్రాల ఆదాయాలకు కవచంగా నిలిచాయి. అయితే పెరుగుతున్న మద్యం ఆదాయాలు... ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతున్నాయి. సామాజిక అశాంతికి ప్రధాన కారణాలవుతున్నాయి. అసలు ఇంతగా రాష్ట్రాలు మద్యంపైనే ఎందుకు ఆధారపడుతున్నాయి? ప్రజల్ని మత్తు ఊబిలో ముంచి పీల్చి పిప్పిచేస్తున్న ప్రభుత్వాల విధానాలు సమీప భవిష్యత్తులోనైనా మారుతాయా? మద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాల ముందున్న ఆదాయమార్గాలు ఏంటనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చ.