ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు - rjy

By

Published : Jul 16, 2019, 2:28 PM IST

అందమైన గూళ్లు అల్లుకోవడం విహంగాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇలాంటి వందల గూళ్లు ఒకేచోట దర్శనమిస్తే... కనులవిందే. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లిలో విద్యుత్తు తీగలకు వేలాడుతున్న పిచ్చుక, పక్షుల గూళ్లు...ఆ దారిన పోయే వారిని కట్టిపడేస్తున్నాయి. సన్నని గడ్డిపరకలతో... అందంగా ఊయల లూగుతున్న గూళ్లు అబ్బురపరుస్తున్నాయి. పిచ్చుకలతోపాటు గిజిగాడు పక్షులు...ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్నట్లు గూళ్లను అల్లుకున్నాయి. ఎండ, వాన, చలి నుంచి తమను తాము రక్షించుకునేలా నిర్మించుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details