కనుల నిండుగా.. కల్యాణ వేడుక - సత్యదేవుని
తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. సర్వాంగ సుందరంగా తయారుచేసిన కల్యాణ మండపంలో.. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో.. వేలాది భక్తజనం నడుమ సత్యదేవుని వివాహ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ముందుగా స్వామివారిని, అమ్మవారిని ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం కల్యాణ తంతు జరిపించారు.