దసరా ఉత్సవాలు.. ఒళ్లు గగుర్పొడిచేలా విన్యాసాలు - kurnool district latest news
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడెకల్లో యువకుల విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. దసరా ఉత్సవాల్లో ఒక యువకుడు వీపునకు ఇనుప కొక్కిలు తగిలించుకుని ద్విచక్రవాహనం, మొద్దులు వంటి బరువైన వస్తువులు లాగాడు. అవే కొక్కిలను చెవులకు తగిలించుకుని గ్యాస్ సిలిండర్ ఎత్తాడు. వీటిని తిలకించడానికి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వచ్చారు.