అహోబిలం.. మదిని దోస్తున్న అందాల జలపాతం - water falls
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎగువ అహోబిలం అటవీప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తైనకొండ నుంచి తెల్లటి నురగలా... జాలువారుతున్న నీటి ధారలు.. అందరినీ కట్టిపడేస్తున్నాయి. అహోబిలం వెనుక భాగాన ప్రహ్లాదబరి, జ్వాలా నరసింహాస్వామి ఆలయం వద్ద నీరు పెద్ద ఎత్తున జాలువారుతోంది.