కాకినాడలో వైభవంగా ఉగాది సంబరాలు - kakinada
తెలుగు వారి కొత్త సంవత్సరాది వేడుకలకు కాకినాడలోని సూర్య కళా మందిరం సుందరంగా ముస్తాబైంది. జిల్లా సాంస్కృతిక మండలి అధ్యక్షులు, కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆధ్వర్యంలో వికారి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. వేద పండితుల పంచాంగ శ్రవణం, కళాకారుల నృత్యాలు వీక్షకులను అలరించాయి.