వైభవంగా శ్రీవారి స్నపన తిరుమంజనం - శ్రీవారి స్నపనతిరుమజనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు వేడుకగా నిర్వహించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మంగళవాయిద్యాలు, వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ గోవిందాచార్యులు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో ఉత్సవమూర్తులను అలంకరించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఎండుద్రాక్ష, వక్కలు, పసుపు కొమ్ములు, తులసి గింజలు, తామర గింజలు, తమలపాకులు, గులాబీ పూల రేకులతో పాటు పగడపు పూలతో తయారు చేసిన మాలలు, కిరీటాలను అలంకరించారు.