Attacks On Dalits: దళితులపై దారుణాలకు అంతెక్కడ..? ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంత..? - ఈటీవీ ప్రతిధ్వని
Attacks on Dalits: రాష్ట్రంలో దళితులపై దారుణాలకు అంతం ఎక్కడ..? తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట ఘటనతో మరోసారి గట్టిగా చర్చకు వచ్చిన ప్రశ్న ఇది. కాళ్లలో రాడ్లు ఉన్నాయి.. కొట్టొద్దు సార్... అని ప్రాధేయపడ్డా కనికరించలేదు. పైగా రాడ్లు ఎక్కడున్నాయి చెప్పు.. అని అడిగి మరీ అక్కడే కొట్టి రాక్షస ఆనందం పొందారు ఖాకీలు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ విచారణ సందర్భంగానే వెలుగులోకి వచ్చిన విషయాలు ఇవి. ఎస్సై వ్యవహార శైలి కారణంగా ఒక నిండు ప్రాణం బలై పోయింది అని.. స్వయంగా ఎస్సీ కమిషన్ సభ్యుడు బసవరావు తెలిపారు. ప్రభుత్వం వైఫల్యం వల్లనే రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయి అన్న విమర్శలకు మరింత బలం చేకూర్చిన విషాదాంతం ఇది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.