ప్రతిధ్వని: వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేదెలా ? - PRATHIDWANI DEBATE ON DRUGS
మాదక ద్రవ్యాల ఉద్ధృతిలో యువతరం మెదళ్లు చిత్తవుతున్నాయి. డ్రగ్స్ దందాల ఆగడాలకు అంతే లేకుండాపోతోంది. ఫ్రెండ్లీ మీట్స్, వీకెండ్ పార్టీస్, ఫెస్టివల్ మూడ్స్... ఒక్కోటి ఒక్కో తరహా. మాదక ద్రవ్యాల మాఫియా పక్కా ప్లాన్‌తో యువతకు వల వేస్తోంది. ఈ ఉచ్చులో చిక్కుకొని వేలాది మంది విలవిల్లాడుతున్నారు. కాటేజీలు, ఫాంహౌజ్‌లే కాదు..కాలేజీలు, స్కూళ్లూ ఈ దందాలకు అడ్డాలవుతుండడం మరింత కలవరపెడుతోంది. అసలు ఈ మత్తు విపత్తుకు కారణాలేంటి? విచ్చలవిడి డ్రగ్స్ సరఫరా కట్టడి ఎలా ? వ్యసనాల బారి నుంచి యువతను కాపాడేదెలా? ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.