ప్రతిధ్వని: కరోనా కష్టకాలంలో సీతమ్మ కనికరించేనా ?
కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులైంది. ప్రజల చేతిలో ఒక్కసారిగా నగదు లేకుండా పోయింది. వాణిజ్య, వ్యాపార వర్గాలతో సహా వేతన జీవులూ అల్లాడిపోతున్నారు. మధ్యతరగతి ప్రజల బడ్జెట్ కుదేలైంది. ఫలితంగా రెండు రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానున్న కేంద్రపద్దు వైపు.. అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. వేతనాలు చెల్లించే వారందరూ బడ్డెట్ సమయంలో తమకేమైనా రాయితీలు వస్తాయా? తమ ఆదాయ పన్నులో ఏమైనా మినహాయింపులు ఉంటాయా? అని ఆశగా చూడడం ప్రతిసారి మామూలైపోయింది. ఈసారి అలాంటి ఆశలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీతో కొన్ని రంగాలను ఆదుకున్న మాదిరిగానే తమకూ అలాంటి ప్రకటనలేమైనా ఉంటాయా? అని మధ్యతరగతి వేతన జీవుల్లో ఆశ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను శ్లాబులపై 'ప్రతిధ్వని' ప్రత్యేక చర్చ చేపట్టింది.