Pawan Fire On Govt: ఎలాంటి యుద్ధం కావాలో వైకాపానే నిర్ణయించుకోవాలి: పవన్ - పవన్ న్యూస్
సమసమాజ స్థాపన కోసం కాపులు ముందుకు రావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం లేని వర్గాలకు అధికారం కోసం అందర్ని కలుపుకుపోవాలని సూచించారు. రాజమహేంద్రవరంలో జరిగిన సభలో మాట్లాడిన ఆయన..కాపు, తెలగ, ఒంటరి, బలిజలు ముందుకొస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. కోపాన్ని దాచుకునే కళ అందరూ నేర్చుకోవాలని అన్నారు. ప్రజాప్రయోజనాల కోసం జరగాల్సిన పనులు జరగనప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. వైకాపా చేయాల్సిన నేరాలు, ఘోరాలన్నీ చేస్తోందని..ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలన్నారు.