Rains: తిరుపతిని ముంచెత్తుతున్న భారీ వర్షం..ఉద్ధృతంగా కపిల తీర్థం - చిత్తూరులో భారీ వర్షం
తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. బుధవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహంతో ప్రమాదకరంగా మారింది. అటవీ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో వస్తున్న వరద.. మెట్లపై ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తిరుమల కనుమదారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న తితిదే..పాపవినాశనం రహదారిని మూసేయటంతో పాటు నడక మార్గంలో భక్తులను అనుమతించటం లేదు.