'సేవ్ మదర్ ఎర్త్' నినాదంతో ఫ్లాష్‌మాబ్ - mob
ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముగింపు సందర్భంగా విశాఖలో "సేవ్ మదర్ ఎర్త్" నినాదంతో యువత అద్భుత నృత్య ప్రదర్శన చేశారు. విశాఖ సీఎంఆర్ మాల్ వేదికగా ఆదివారం రాత్రి ఫ్లాష్‌మాబ్‌తో ఆకట్టుకున్నారు. నృత్య డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీకి చెందిన 70 మంది తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పర్యావరణాన్ని కాపాడాలని సందేశాన్ని ఇచ్చారు.