దారి తప్పిన జింక పిల్ల..రైతు ఒడికి సురక్షితంగా! - గోదావరి
గోదావరి మధ్య లంకల్లో సంచరించే వన్యప్రాణాలు గోదావరి వరదకు విలవిలలాడుతున్నాయి. గోదావరి మధ్యలో ఉండే దుబ్బ ప్రాంతాల్లో జింకలు, లేళ్లు జీవిస్తుంటాయి. అప్పుడప్పుడూ గోదావరి ఇసుక తిన్నెల్లో పరుగులు పెడుతూ కనిపిస్తుంటాయి. గోదావరి వరదలతో వాటికి ఏం చేయాలో తోచని పరిస్థితి. అలా...తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి లంకలోకి పరుగులు పెడుతూ వచ్చాయి. అందులో ఓ జింక లంక ప్రాంతంలోనే జింక పిల్లకు జన్మనిచ్చింది. జింక పిల్ల కుక్కల బారిన పడకుండా రైతులు కాపాడారు.